రోడ్డు ప్రమాదం: రెండు కార్లను ఢీకొన్న మరో కారు

రోడ్డు ప్రమాదం: రెండు కార్లను ఢీకొన్న మరో కారు

యూఏఈ మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, వాహనదారుల్ని అప్రమత్తం చేస్తూ ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ట్రాఫిక్‌ సిగ్నల్‌ని గమనించిన రెండు కార్లు తమ వేగాన్ని తగ్గించగా, దీన్ని గమనించి మరో కారు వేగంగా దూసుకొచ్చి, ఆ రెండు కార్లను ఢీకొనడం వీడియోలో స్పష్టంగా కన్పిస్తోంది. ఈ తరహా రోడ్డు ప్రమాదాలకు ఏకాగ్రత లోపించడమే కారణమని మినిస్ట్రీ చెబుతోంది. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా వుండాలనీ ఫోన్లను వాడటం, మేకప్‌ వేసుకోవడానికి ప్రయత్నించడం, పిల్లలతో ఎంటర్‌టైన్‌ అవడం, కారులో వెళుతూ ఆహారం తీసుకోవడం వంటివి ప్రమాదాలకు కారణమని మినిస్ట్రీ చెబుతోంది.   

 

Back to Top