ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్ష

ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్ష

న్యూఢిల్లీ: ఏపి సిఎం చంద్రబాబు ఏపికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం తీరును నిరసిస్తూ ఢిల్లీలో ఆయన చేపట్టిన ధర్మపోరాట దీక్ష ప్రారంభమైంది. దేశరాజధానిలోని ఏపీ భవన్‌ వేదికగా సీఎం చంద్రబాబు దీక్షను ప్రారంభించారు. నల్లచొక్కాతో దీక్షకు హాజరయ్యారు.అంతకుముందు సీఎం చంద్రబాబు రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. ఏపీ భవన్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. దీక్షా వేదికపై గాంధీ, అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌ చిత్ర పటాలకు చంద్రబాబు నివాళులర్పించారు. రాత్రి 8 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. అనంతరం చంద్రబాబు ప్రసంగించనున్నారు.

Back to Top