దోఫార్లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఆర్వోపి
- February 22, 2019మస్కట్:హత్యాయత్నం, దొంగతనం, ఆల్కహాల్ విక్రయం అభియోగాలను ఎదుర్కొంటోన్న ఓ వ్యక్తిని దోఫార్ గవర్నరేట్ పరిధిలో పోలీసులు అరెస్ట్ చేశారు. దోఫార్ గవర్నరేట్ పోలీస్ - డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, సలాలా పోలీస్ స్టేషన్ కలిసి నిర్వహించిన ఆపరేషన్లో ఆసియా జాతీయుడ్ని అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తిని ఈ నిందితుడు కత్తితో పొడిచాడని, విలాయత్ ఆఫ్ సలాలాలో ఈ ఘటన జరిగిందనీ, ఆర్థిక వివాదమే ఈ ఘటనకు కారణమని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించడం జరిగింది. మరో కేసులో డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, ఆ్కలహాల్ సేవించడం, అలాగే అక్రమంగా విక్రయించడం వంటి అభియోగాల నేపథ్యంలో ఓ అనుమానితుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడు ఆసియా జాతీయుడని రాయల్ ఒమన్ పోలీస్ తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!