*APPLE*

- February 22, 2019 , by Maagulf

ఇటు 
నా ఊసు మరిసినోడు 
నా బతుకు పట్టనోడు 
నా ఉనికి గిట్టనోడు 
చావడానికే  నేను పుట్టాననీ 
ప్రతి రోజు నన్ను నిదుర లేపే కల !

అటు 
అప్పుడప్పుడూ  ఒకడు కెలుకుతుంటాడు 
మార్పుకు సిద్ధం కమ్మని చెప్పి 
పోరుకు బలి  చేస్తుంటాడు .
కడుపు నిండా  నాలుగు ముద్దలు లేని 
కంటి నిండా తీయటి కునుకే లేని , నాకు 
ఉన్న కొద్ది  వెలుతురులో 
చీకట్లను పారబోసి నన్ను నిలబెడతానంటాడు 

ఇంకో వైపు 
నూర్గురికి తోడుండి 
ఆ నూర్గురినీ చంపించిన 
పిట్ట కథల మేధావి శవమింకా మూల్గుతూనే వుంది 
రాలిపోతున్న నాకు 
రెక్కలనిస్తానని పొగబెడుతున్నది 

ఈ మట్టికే తోడబుట్టినోన్ని 
సరిహద్దుల గోడ కట్టుకున్న దేశాలకు, గోడు  పట్టనోన్ని !!

ప్రతీ దిక్కూ 
పరువు కోసం  పోరాడుతున్నది !
నన్ను దిక్కులేని వాన్ని చేస్తున్నది.
తీయని పండై  ఒక కథగా మిగిలిపోకుండా 
అప్పడప్పుడూ నీ  నోట్లో కరిగిపోవాలనే ఉంటుంది నాకు.

--*పారువెల్ల*

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com