*APPLE*
- February 22, 2019ఇటు
నా ఊసు మరిసినోడు
నా బతుకు పట్టనోడు
నా ఉనికి గిట్టనోడు
చావడానికే నేను పుట్టాననీ
ప్రతి రోజు నన్ను నిదుర లేపే కల !
అటు
అప్పుడప్పుడూ ఒకడు కెలుకుతుంటాడు
మార్పుకు సిద్ధం కమ్మని చెప్పి
పోరుకు బలి చేస్తుంటాడు .
కడుపు నిండా నాలుగు ముద్దలు లేని
కంటి నిండా తీయటి కునుకే లేని , నాకు
ఉన్న కొద్ది వెలుతురులో
చీకట్లను పారబోసి నన్ను నిలబెడతానంటాడు
ఇంకో వైపు
నూర్గురికి తోడుండి
ఆ నూర్గురినీ చంపించిన
పిట్ట కథల మేధావి శవమింకా మూల్గుతూనే వుంది
రాలిపోతున్న నాకు
రెక్కలనిస్తానని పొగబెడుతున్నది
ఈ మట్టికే తోడబుట్టినోన్ని
సరిహద్దుల గోడ కట్టుకున్న దేశాలకు, గోడు పట్టనోన్ని !!
ప్రతీ దిక్కూ
పరువు కోసం పోరాడుతున్నది !
నన్ను దిక్కులేని వాన్ని చేస్తున్నది.
తీయని పండై ఒక కథగా మిగిలిపోకుండా
అప్పడప్పుడూ నీ నోట్లో కరిగిపోవాలనే ఉంటుంది నాకు.
--*పారువెల్ల*
తాజా వార్తలు
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్‌ను కలిసిన భారత రాయబారి
- ఖతార్‌లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు