హీరో: విజయ్ దేవరకొండ + నయన్
- March 05, 2019యూత్ స్టార్ విజయ్ దేవరకొండ అతి తక్కువ టైంలోనే ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సెన్సేషన్ స్టార్‌కి సౌత్‌లోనే కాదు నార్త్‌లోను ఫుల్ క్రేజ్ ఉంది. అయితే తెలుగులో విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన విజయ్ దేవరకొండ నోటా చిత్రంతో తమిళ ప్రేక్షకులని పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇప్పుడు మరో బైలింగ్యువల్ చిత్రంతో కోలీవుడ్ మార్కెట్‌పై పట్టు బిగించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ప్రముఖ నిర్మాత ఎస్ఆర్ ప్రభు, కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఓ చిత్రం చేయనున్నాడట. ఇందులో హీరోగా విజయ్ దేవరకొండ పేరు వినిపిస్తుండగా, హీరోయిన్గా లేడీ సూపర్ స్టార్ నయనతార అనే టాక్ వినిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ని తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి హీరో అనే టైటిల్ సరిపోతుందని యూనిట్ భావిస్తుందట. మరి హీరో టైటిల్‌తో విజయ్ దేవరకొండ ఏ మేరకు అలరిస్తాడో చూడాలి. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ చిత్రంతో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ రెండు చిత్రాలు 2019లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..