అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- May 14, 2024
బహ్రెయిన్: రాబోయే బుధ మరియు గురువారాల్లో ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఒక సలహాను జారీ చేసింది. రెండు రోజుల సమ్మిట్‌లో ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని ప్రజలకు సూచించారు. బహ్రెయిన్ రాజ్యం నిర్వహిస్తున్న 33వ అరబ్ సమ్మిట్ సమయంలో ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి, మే 15 మరియు 16 తేదీల్లో ఉదయం మరియు సాయంత్రం వేళల్లో కొన్ని రోడ్లపై ఆంక్షలు విధించనున్నారు. ఇందులో భాగంగా వాహనాలను మళ్లిస్తారు.
బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లే ఖలీఫా అల్ కబీర్ హైవేపై ఆంక్షలు ఉంటాయి. అల్-గౌస్ స్ట్రీట్, షేక్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జ్ గుండా వెళ్లాలి. కింగ్ ఫైసల్ హైవే, షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవే మీదుగా సీఫ్ డిస్ట్రిక్ట్ దిశగా వెళ్లాల్సి ఉంటుంది. సదరన్ మరియు నార్తర్న్ గవర్నరేట్లలోని వారికి, రాజధాని వైపు జబర్ అల్-సబా స్ట్రీట్, షేక్ సల్మాన్ హైవే మరియు షేక్ ఇసా బిన్ సల్మాన్ హైవే ఓపెన్ ఉంటుంది. క్యాపిటల్ గవర్నరేట్ నివాసితులు అల్ ఫతే హైవే, ప్రభుత్వ అవెన్యూ మరియు గవర్నరేట్ అంతర్గత వీధులను ఉపయోగించవచ్చు. ముహరక్ గవర్నరేట్‌లో, ఖలీఫా బిన్ సల్మాన్ బ్రిడ్జ్, డ్రై డాక్ హైవే, ఆరాద్ హైవే, రయ్యా హైవే, షేక్ సల్మాన్ హైవే మరియు షేక్ హమద్ బ్రిడ్జ్ ఉన్నాయి. షేక్ హమద్ వంతెన బుసైటీన్ మరియు పరిసర ప్రాంతాల నివాసితులకు అందుబాటులో ఉంది. సమాహీజ్, ఖలాలీ, అల్-దైర్, అరద్ మరియు అల్-హిద్లలోని వారికి, షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ వంతెన సరైన ప్రత్యామ్నాయంగా సూచించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!