సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!

- May 14, 2024 , by Maagulf
సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!

రియాద్: సౌదీ కమీషన్ ఫర్ హెల్త్ స్పెషాలిటీస్‌లో నమోదు చేసుకున్న సౌదీ అరేబియాలోని నర్సింగ్ సిబ్బంది సంఖ్య 2023 సంవత్సరంలో 235,000 దాటింది. మే 12న జరుపుకున్న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2016 మరియు 2023 మధ్య కాలంలో మొత్తం మేల్, ఫీమేల్ నర్సుల సంఖ్య 23 శాతానికి పైగా పెరిగింది. 2023 సంవత్సరంలో సౌదీ ఆరోగ్య రంగంలో నమోదిత నర్సింగ్ సిబ్బంది మొత్తం సంఖ్య 235,461కి పెరిగింది. 2018లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రచురించిన మునుపటి నివేదిక ప్రకారం నమోదిత నర్సుల సంఖ్య 184,565గా ఉంది. వీరిలో 70,319 మంది సౌదీ పౌరులు ఉన్నారు. విదేశీ నర్సులు మొత్తం నర్సుల సంఖ్యలో 70 శాతం ఉన్నారు. వీరిలో ఎక్కువగా భారతీయులు, ఫిలిపినో మరియు మలేషియన్లు ఉన్నారు. తాజా నివేదిక ప్రకారం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కింద 106,000 కంటే ఎక్కువ మంది నర్సులు పనిచేస్తున్నారు. ఇతర ప్రభుత్వ సంస్థలలో వారి సంఖ్య సుమారు 15,000కి చేరుకుంది. ప్రైవేట్ సెక్టార్‌లో 67,000 మంది నర్సులు పనిచేస్తున్నారు.14 సౌదీ విశ్వవిద్యాలయాలలో నర్సింగ్ స్పెషలైజేషన్లు కలిగిన కోర్సులను అందజేస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com