సుర్ అల్ హదిద్ బీచ్ కార్నివాల్ ప్రారంభం
- March 08, 2019మస్కట్: మస్కట్ గవర్నరేట్ పరిధిలోని సీబ్ బీచ్ వద్ద సుర్ అల్ హదిద్ బీచ్ కార్నివాల్ ప్రారంభమయ్యింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కార్నివాల్ వుంటుంది. మస్కట్ మునిసిపాలిటీ ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొంది. కార్నివాల్లో రెస్టారెంట్స్, కేఫ్స్, షాపింగ్ కార్నర్, ఎంటర్టైన్మెంట్ షోస్, స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అలాగే బీచ్ గేమ్స్ ఆహూతుల్ని అలరిస్తాయి. ఒమన్‌లో తొలి బీచ్ ఈవెంట్ అయిన ఈ ఫెస్టివల్‌ని మస్కట్ మునిసిపాలిటీ - మినిస్ట్రీ ఆఫ్ టూరిజం - ఒమన్ టూరిజం డెవలప్మెంట్ కంపెనీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. డొమెస్టిక్ టూరిజంని ప్రోత్సహించే క్రమంలో ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. అల్ సీబ్ క్లబ్ నిర్వహించే బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ ఈ ఈవెంట్లో మరో ప్రధాన ఆకర్షణ. జెట్ స్కీయింగ్, బనానా బోట్ రైడింగ్, కయాకింగ్ వంటి ఆకర్షణలూ వున్నాయి.
తాజా వార్తలు
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు