మహిళకు వందనం.. గూగుల్ స్పెషల్ ట్రీట్
- March 08, 2019ఆమె వేరు, అతడు వేరు.. కాదు కాదు ఇద్దరూ ఒక్కటే. అసమానతలున్నచోట సమానత్వం కోసం గొంతు విప్పుతోంది. సాధికారత కోసం ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సెర్చ్ ఇంజన్ గూగుల్ ‘ఆమె’కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. ప్రత్యేక డూడుల్‌ను పెట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకునే ప్రముఖ భాషలను తీసుకుని ఆయా భాషల్లో మహిళలను ఏమంటారో వివరిస్తూ డూడుల్‌ను ఏర్పాటు చేసింది. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూతో కలిపి మొత్తం 11 భాషల్లో మహిళ పేరుని ప్రస్తావించింది. అంతే కాకుండా (GOOGLE) స్పెల్లింగ్‌లో రెండు ‘O’ వద్ద క్లిక్ బటన్‌ని చూపిస్తోంది. దీన్ని క్లిక్ చేస్తే మహిళలకు సంబంధించి ప్రముఖ రచయితలు, సెలబ్రిటీలు చెప్పిన కొటేషన్స్‌ను చూపిస్తుంది.
వీటిలో రష్యన్, ఫ్రాన్స్, బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ నవలా రచయితల కొటేషన్స్‌ను చూపించింది. మహిళలను ఉద్దేశించి ఇండియన్ బాక్సర్ మేరికోమ్ ఇచ్చిన కొటేషన్‌ను కూడా పబ్లిష్ చేసింది. ప్రత్యేక సందర్భాల సమయంలో సెర్చ్ ఇంజన్ గూగుల్ ఇలా స్పెషల్ డూడుల్స్‌ని పెట్టి శుభాకాంక్షలు తెలియజేస్తుంటుంది.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!