డాక్టర్ల మాటలతో ‘సోనాలీ’ షాక్..
- March 09, 2019ఖరీదైన వైద్యం కంటే కాసిని మంచి మాటలు బ్రతుకుపై ఆశలు కల్పిస్తాయి. డాక్లర్లు చెప్పిన మాటలకి కృంగిపోకుండా కొంత మనోధైర్యాన్ని, మరికొంత భర్త వాత్సల్యం కలిసి ఆమెను త్వరగా కోలుకునేలా చేసింది. తనకి క్యాన్సర్ ఉందని తెలిసిన కొత్తలో పరిస్థితి వివరించింది సోనాలీ బింద్రే ఓ ఇంటర్వ్యూలో.. మెరుగైన చికిత్స కోసం భర్త గోల్డీ న్యూయార్క్ వెళదామన్నారు. కానీ అందుకు నేను తిరస్కరించాను. ఇక్కడే మంచి డాక్టర్లు ఉన్నారు కదా. వేరే దేశం ఎందుకు వెళ్లాలి అని ఆయనతో గొడవపడ్డాను. మూడు రోజుల్లో వచ్చేద్దామని గోల్డీ నన్ను ఒప్పించారు . న్యూయార్క్‌లోకి అడుగుపెట్టిన తరువాత అక్కడి వైద్యులను కలిసిన తరువాత క్యాన్సర్‌కు సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహించారు. వ్యాధి నాలుగో దశలో ఉందని.. బతికే అవకాశాలు 30 శాత్రం మాత్రమే ఉన్నాయన్నారు. ఆ మాటలతో తాను షాక్‌కి గురయ్యానన్నారు. ఆ క్షణంలో నా భర్తని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాను. మంచి ట్రీట్మెంట్ ఇప్పించి, నా కెంతో సపోర్ట్‌గా నిలిచి, ఎంతో ధైర్యాన్నిచ్చిన నా భర్తకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదన్నారు. చికిత్స తీసుకునే సమయంలో సోనాలీ సోషల్ మీడియా ద్వారా తన మనోభావాలను ఎప్పటికప్పుడు అభిమానులకు షేర్ చేస్తూ కొంత ఊరట చెందారు. ట్రీట్మెంట్ అనంతరం ఇండియాకి తిరిగి వచ్చిన సోనాలి క్యాన్సర్‌పై అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహిస్తూ.. బాధితుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తున్నారు. మారిన జీవనశైలి కారణంగా క్యాన్సర్ మహహ్మారి మనుషులను పట్టి పీడిస్తోంది. మెరుగైన వైద్యం, గుండె నిబ్బరం, కృంగిపోని ఆత్మవిశ్వాసం వ్యాధినుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది. నటి మనీషా కోయిరాలా, క్రికెటర్ యువరాజ్ సింగ్ క్యాన్సర్‌ని జయించి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం