బోయింగ్స్ రద్దు
- March 14, 2019ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమాన ప్రమాదం తర్వాత, ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా విమానాల్లో ప్రయాణించేందుకు ప్రయాణీకులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని పలు సంస్థలు, తమ విమానాల్ని రద్దు చేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్, ఇండియా, అమెరికా కూడా బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమాన సేవల్ని నిలిపివేశాయి. ఇథియోపియా, సింగపూర్, చైనా, ఫ్రాన్స్, ఐర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇండోనేసియా, మలేసియా ఈ విమాన సేవల్ని నిలిపివేసినట్లు ప్రకటించాయి. యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ సైతం ఈ విమాన యాన సేవల్ని నిలిపివేసినట్లు ప్రకటించిన విషయం విదితమే. తదుపరి నోటీసు ఇచ్చేవరకు యూఏఈ ఎయిర్ స్పేస్‌లోకి ఈ విమానాల్ని అనుమతించడంలేదు. ఏ ఆపరేటర్ కూడా యూఏఈ నుంచి, యూఏఈ వరకు ఈ విమానాలు నడపడానికి వీల్లేదని ఇప్పటికే జీసీఏఏ ఓ ప్రకటనలో పేర్కొంది. మరికొన్ని దేశాలు కూడా ఈ విమానాలపై తాత్కాలిక నిషేధాన్ని ప్రకటిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!