ఫ్లైట్‌ ఎస్కార్ట్స్‌ నుంచి తప్పించుకోవడం అసాధ్యం

ఫ్లైట్‌ ఎస్కార్ట్స్‌ నుంచి తప్పించుకోవడం అసాధ్యం

విమానాల్లో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సిబిఐసి) ఏర్పాటు చేసిన ఎస్కార్ట్స్‌ ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తాజాగా హైద్రాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో బారీ గోల్డ్‌ స్మగ్లింగ్‌ రాకెట్‌ని అధికారులు భగ్నం చేశారు. ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ - ఆర్‌జిఐఏతోపాటు ఎస్కార్ట్‌ టీమ్స్‌ విమానాల్లో మోహరించి, ప్రయాణీకుల్ని పరిశీలిస్తారు. ప్రత్యేకించి దుబాయ్‌ నుంచి వచ్చేవారి పట్ల ఈ ఎస్కార్ట్స్‌ అప్రమత్తంగా వ్యవహరిస్తారు. బ్యాగ్‌లను ఎక్స్‌ఛేంజ్‌ చేసుకునేవారిపై దృష్టిపెట్టి, అదుపులోకి తీసుకుంటున్నారు. కస్టమ్స్‌ కమిషనర్‌ ఎంఆర్‌ఆర్‌ రెడ్డి మాట్లాడుతూ, ఎస్కార్ట్స్‌ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తారని చెప్పారు. కొత్త ఎస్కార్ట్స్‌ విధానం సత్ఫలితాలనిస్తోందనీ, స్మగ్లింగ్‌ రాకెట్స్‌ని భగ్నం చేయగలుగుతున్నామనీ ఎస్కార్ట్స్‌ కళ్ళు గప్పి తప్పించుకోవడం అసాధ్యమని అధికారులు తెలిపారు. 

Back to Top