పనాజీలో పారీకర్ అంత్యక్రియలు..

పనాజీలో పారీకర్ అంత్యక్రియలు..

గోవా ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి మనోహర్ పారీకర్ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు. పారీకర్ వయసు 63 ఏళ్లు. పారికర్‌ను రక్షించేందుకు వైద్యులు చేసిన ప్రయ త్నాలు ఫలించలేదు. దీంతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని గోవా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
 
ఆయన మృతిపై రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పారీకర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలి పారు. దేశం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని తమ సంతాప సందేశాల్లో పేర్కొన్నారు. పారీకర్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు.

యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, లోక్‌సభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే సహా పలువురు విపక్ష నాయకులు పారీకర్ మృతిపై సంతాపం ప్రకటించారు. దేశానికి పారీకర్ చేసిన సేవలు అసా మాన్యమని కొనియాడారు.

పారీకర్ మృతితో గోవా శోకసంద్రంలో మునిగిపోయింది. కుల-మత-వర్గాలకు అతీతంగా ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. రాజకీయాలకు అతీతంగా నాయకులు పారీకర్ మృతదేహాన్ని సందర్శించి ఘన నివాళి అర్పించారు. ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఉదయం పనాజీలోని బీజేపీ కార్యాలయంలో పారికర్‌ మృతదేహానికి నివాళులు అర్పిస్తారు.అనంతరం కళా అకాడమికీ తీసుకెళ్తారు. 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాధారణ ప్రజల సందర్శనార్థం పారికర్‌ పార్దివదేహాన్ని ఉంచుతారు. సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అటు దేశవ్యాప్తంగా నేడు కేంద్రం సంతాపం ప్రకటించనుంది. దేశ రాజధానితో పాటు, రాష్ట్రాల రాజధానుల్లో జాతీయ పతాకాన్ని అవతనం చేస్తారు.

Back to Top