మోహన్‌బాబు హౌస్ అరెస్ట్
- March 22, 2019సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ సంస్థల ఛైర్మన్ మోహన్‌బాబు నివాసం వద్ద ఉదయం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన తిరుపతిలో ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో.. ఆయన బయటకు రాకుండా నిలువరించిన పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో.. పోలీసులకు , మోహన్‌బాబుకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎట్టిపరిస్థితుల్లోనూ తాను ఆందోళన చేసి తీరతానని మోహన్‌బాబు పట్టుదలగా ఉన్నారు. ఈనేపథ్యంలో.. శ్రీవిద్యా నికేతన్ వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు