తలైవా 167వ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
- April 09, 2019సూపర్ స్టార్ రజనీకాంత్ నుండి ఓ మంచి చిత్రం రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా ఆయన స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో చిత్రం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఎప్పుడో వచ్చిన సెట్స్ పైకి వెళ్ళేoదుకు చాలా టైం పట్టింది. నేటి నుంచి చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ముంబయిలో భారీ సెట్ ఏర్పాటు చేశారు. తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ రివీల్ చేసారు. 'దర్బార్' అనే టైటిల్ ని చిత్రానికి ఫిక్స్ చేసిన యూనిట్ ఫస్ట్ లుక్ లో రజనీకాంత్‌ని పవర్ఫుల్ గా చూపించారు. రజిని వెనుక తుపాకులు, బెల్ట్, బేడీలు కనిపిస్తున్నాయి. రెండు నెలలో చిత్రాన్ని పూర్తి చేయాలని మురుగదాస్ భావిస్తున్నాడట. నయనతార చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, అనిరుధ్ రవిచంద్రన్ మరోసారి రజనీకాంత్ చిత్రానికి స్వరాలు అందించేందుకు సిద్ధమయ్యారు. మాస్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఇందులో రజనీకాంత్ సామాజికవేత్తగా, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ముంబయి నేపథ్యంలో సినిమా సాగుతుందని ఫస్ట్‌లుక్‌ను చూస్తే అర్థమవుతోంది.
తాజా వార్తలు
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్‌లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్‌గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..