మహిళకు సాయపడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడు
- April 15, 201922 ఏల్ళ యువకుడు, ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ కారు బ్రోక్ డౌన్ అవడంతో, ఆమెకు సాయపడేందుకు వెళ్ళిన యువకుడ్ని మరో వాహనం వేగంగా వచ్చి ఢీ కొంది. మృతుడ్ని టాంజానియన్ వ్యక్తిగా గుర్తించారు. తన కారుతో, ఆగిపోయిన కారుని లాగేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఆ యువకుడు మరో వాహనం కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన గురించి సమాచారం అందగానే ట్రాఫిక్ ఎక్స్పర్ట్స్, పెట్రోల్స్ మరియు నేషనల్ అంబులెన్స్ అక్కడికి చేరుకున్నాయి. మృతదేహాన్ని అల్ కువైటీ హాస్పిటల్ మార్గ్యుకి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక