లారెన్స్‌కి 10 లక్షలు విరాళం అందించిన చిరు
- April 18, 2019కొరియోగ్రాఫర్ నుండి నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక వైపు కళాసేవ చేస్తూనే మరో వైపు ప్రజా సేవ చేస్తున్న లారెన్స్ ప్రజల గుండెలలో చెరగని ముద్ర వేసుకున్నాడు. లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న లారెన్స్ 150కి పైగా చిన్నారులకి ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించారు. 200 మంది పిల్లలకి ఉచిత విద్యని అందిస్తున్నాడు. కొందరిని తాను దత్తత తీసుకొని వారికి అండగా నిలుస్తున్నాడు. ఇటీవల కేరళ వరద బాధితులకి ఏకంగా కోటి రూపాయాల సహాయార్థం ప్రకటించారు. ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీ నుండి ఇదే అత్యధిక విరాళం కావడం కూడా విశేషం. అయితే ఇప్పుడు తన తన ట్రస్ట్ హైదరాబాద్ లో కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు లారెన్స్ .ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి లారెన్స్‌కి తనవంతు సాయంగా 10 లక్షల విరాళాన్ని అందించారు. ఆయన నటించిన తాజా చిత్రం కాంచన 3 పెద్ద విజయం సాధించాలని కూడా చిరు కోరారు. కాంచన 3 చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు తెలుగులో విడుదల చేస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ