దిక్సూచి రివ్యూ

- April 27, 2019 , by Maagulf
దిక్సూచి రివ్యూ

కొత్త కథలు, కథనాలు ప్రేక్షకుల్ని ఎప్పుడూ ఎంటర్ టైన్ చేస్తాయి. అలాంటి ప్రయత్నమే ‘దిక్సూచి’. చైల్డ్ ఆర్టిస్ట్ గా సుపరిచితుడైన దిలీప్ కుమార్ సాల్వాది హీరో గా దర్శకుడిగా ఈకథకు దిక్సూచిగా మారాడు. డెవోషనల్ క్రైం థ్రిల్లర్ గా ట్రైలర్ తో ఆకట్టుకున్న ‘దిక్సూచి’ ఎంత వరకూ ఆకట్టుకుందో చూద్దాం.


కథ:

దిలీప్ ఒక టివి ఛానల్ లో రిపోర్టర్ గా పనిచేస్తుంటాడు. ఒకరోజు తన చెల్లిని కాలేజ్ లో వదలి పనిమీద ట్రైన్ లో ఒక ఊరికి ప్రయాణం అవుతాడు. ఆ ప్రయాణం లో అతనికి ఒక తెలియని వ్యక్తినుండి కాల్ వస్తుంది. అతను చెప్పినట్లు చేయకపోతే దిలీప్ చెల్లిని, తల్లిని చంపేస్తాం అంటూ బెదిరిస్తారు. వాళ్ళు చెప్పినట్లు చేసే క్రమంలో అతనికి ఒక పదేళ్ళ వయస్సు గల ఆడపిల్ల కనపడుతుంది . చేతిలో ఒక లాంతరు తో ఆ అమ్మాయి అతని సమస్యకు దారి చూపిస్తుంది. ఆతరువాత తన వాళ్లను కనిపెట్టే క్రమంలో 1975లో రాజా బుధురాపురం లో ఇలాగే కొన్ని కిడ్నాప్లు జరుగుతాయి. ఆ కిడ్నాపులకి దిలీప్ కి ఏమైనా లింక్ ఉందా..? ఏవరా అమ్మాయి..? ఆ అమ్మాయికి కి దిలీప్ కి సంబందం ఏంటి..? అనేది మిగిలిన కథ..?


కథనం:
దిలీప్ లో వయస్పుకు మించిన పరిణితి కనిపించింది. అది టైటిల్ వేసే క్రమంలో వేదాంత దోరణి లో సాగే ఒక పాటలో మానవ జీవితం లోని క్రమాలను , చేరే గమ్యాలను చెప్పే ప్రయత్నం చేసాడు. ‘మట్టిలోన  మట్టిరా దేహమన్నది’ సాంగ్ తో థియేటర్స్ లో ఆడియన్స్ ని తన సినిమాకు కావాల్సిన మూడ్ లోని తేవడం లో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. రెగ్యులర్ సినిమా కాదు అనే విషయాన్ని టైటిల్స్ దగ్గరనుండే పరిచయం చేయడం మొదలు పెట్టాడు. ఇక హీరో ఇంట్రడక్షన్ ల కోసం టైం  తీసుకోకుండా డైరెక్ట్ గా కథలోకి వచ్చాడు. ట్రైన్ లో బిత్తిరి సత్తి ఎపిసోడ్ కాసేపు ఎంటర్ టైన్ చేసింది. ఇక కథలోని మెయిన్ థీమ్ స్ట్రార్ట్ అయ్యాక దిక్సూచి వేగం అందుకుంటుంది. అక్కడి నుండి కథలోని ఇంట్రెస్ట్ ని ఏమాత్రం తగ్గించకుండా జాగ్రర్త పడ్డాడు దర్శకుడు దిలీప్. ఇక కథ రాజుగారి బంగళాకు వెళ్ళాక  అక్కడ కాసేపు కథ ఏం జరుగుతుందా అనే సస్పెన్స్ తగ్గింది. రెగ్యులర్ కథలను చూసే ప్రేక్షకులకు దిక్సూచి కొత్త ఎక్స్ పీరియన్స్ లను అందిస్తుంది. అక్కడ నుండి కథలోని మూలాలలకు వెళ్ళాడు దర్శకుడు తీసుకున్న రాజుగారి మనమరాలు ఎపిసోడ్ ఈ కథకు ఆయువు పట్టుగా మారింది. ఆ కథలో సమాజంలో చాలా సమస్యలను దర్శకుడు సృజించాడు. తారాలు మారుతున్నా మనుష్యుల మద్య తరగని అంతరాలు.. కులమతాల పట్టింపులు మనుషులను విడదీయడమే కాదు, రాక్షసులుగా మార్చుతాయని గుర్తు చేసాడు. చత్రపతి శేఖర్ తన పాత్రలో జీవించాడు. ఇప్పటి వరకూ అతని కెరియర్ లో చెప్పుకోదగ్గ పాత్రలలో దిక్సూచి ఒకటిగా మారుతుందనడంలో సందేహం లేదు. ఇక హీరోయిన్ చాందని పాత్రకూడా కేవలం పాటలకోసమో, గ్లామర్ కోసమో కాకుండా కథతో పాటు నడిచే పాత్రగా తీర్చిదిద్దాడు దర్శకుడు. సెంకండాఫ్ అంతా గుడి చుట్టూనే కథ నడుస్తుంది. అయితే కథలో మనిషి ప్రతి యుగానికి ఏలా దిగజారుతున్నాడు అనే విషయాన్ని ఒక సబ్జెక్ట్ గా చేప్పే ప్రయత్నం చేసాడు . అక్కడికి ఆ పాయింట్ గా బాగున్నా, కథనం కు ఇబ్బంది కలిగించింది.


దిలీప్ నటన కంటే అతను రాసుకున్న కథ, కథనాలే ఎక్కువ ఇంప్రెస్ చేసాయి. సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలను తీసుకొని మూలకథగా మలచుకొని దాన్ని ఒక ఎమోషనల్ థ్రిల్లర్ గా మలచడంలో దర్శకుడు దిలీస్ సక్సెస్ అయ్యాడు. నిర్మాత నరసింహా రాజు ఉత్తమాభిరుచి ఈ కథను ఎంచుకోవడం కనిపిస్తుంది.


చివరిగా:
కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు దిక్సూచి మంచి ఎక్స్ పీరియన్స్ గా మిగులుతుంది. దర్శకుడిగా, నటుడిగా దిలీప్ మంచి ప్రతిభను కనబరిచాడు.

--మాగల్ఫ్ రేటింగ్ 2.75/5
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com