తెలుగు రాక్ స్టార్ శ్రీరామ్ అల్లూరి కొత్త ఆల్బమ్..మే 4న విడుదల
- May 02, 2019'రాక్ ఎన్ రోల్' అంటే అందరికీ ఇంగ్లీష్ పాటలే గుర్తుకు వస్తాయి. అయితే ఈ ప్రక్రియలో తొలిసారి మన గొంతుకై నిలిచాడు శ్రీరామ్ అల్లూరి. తెలుగు భాషా మధురిమలను అంతర్జాతీయంగా పంచుతున్న ఈ హైదరాబాదీ.. తెలుగు పాటకు కొత్తందాలను సమకూరుస్తున్నాడు. యూకేలో వినిపిస్తున్న ఈ పడమటి సంధ్యారాగానికి మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. శ్రీరామ్ రూపొందించిన కొత్త ఆల్బమ్ ''ఓ కథ: టేల్స్ ఆఫ్ దిస్ తెలుగు మ్యాన్'' ఈ నెల 4న విడుదల కానుంది. ఇటాలియన్ మ్యూజిక్ బ్యాండ్‌తో కలిసి చేస్తున్న తొలి తెలుగు ఆల్బమ్ ఇది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన శ్రీరామ్.. ఏపీ, తెలంగాణలోని యూనివర్సిటీలలో లైవ్ మ్యూజిక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నామని తెలిపారు. దీనివల్ల యువత నుంచి ఫీడ్ బ్యాక్ పొందొచ్చన్నారు. లైవ్ మ్యూజిక్ చేయడమంటే తనకు చాలా ఇష్టమన్నారు. స్వయంగా పాటలు రాసి, మ్యూజిక్ చేయడంపైనే ఎక్కువ ఆసక్తి ఉందన్నారు. తనకు ప్రశంసలు కన్నా..తనలోని నెగిటీవ్ పాయింట్లే ఎక్కువగా గుర్తుంటాయని.. వాటి నుంచే ఎక్కువగా నేర్చుకుంటానన్నారు. టాలీవుడ్ నుంచి అవకాశం వచ్చిందని.. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదన్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు