మరో ప్రతిష్టాత్మకమైన ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..

- May 02, 2019 , by Maagulf
మరో ప్రతిష్టాత్మకమైన ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..

ఎన్నో విజయాలతో ప్రపంచమే భారత్‌ను చూసి గర్వపడేలా చేసిన ఇస్రో మరో ప్రతిష్టాత్మకమైన ప్రయోగానికి సిద్ధమైంది. ఇప్పటికే చంద్రయాన్‌-1ను విజయవంతంగా ప్రవేశపెట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ…ఇప్పుడు చంద్రయాన్‌-2 ప్రయోగానికి అంతా సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది జులై 9-16 తేదీల మధ్య చంద్రయాన్‌-2 ప్రయోగం చేపట్టబోతున్నామని అధికారికంగా ప్రకటించింది ఇస్రో.

చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్-1 ప్రయోగం ఎంతగానో ఉపయోగపడింది. అంతేకాదు చంద్రుడిపై నీటి జాడను కొనుగొనడంలో నాసాకు భారత ప్రయోగం దోహదపడింది. ఇప్పుడిదే స్ఫూర్తితో చంద్రయాన్‌-2 ప్రయోగానికి శ్రీకారం చుట్టారు ఇస్త్రో శాస్త్రవేత్తలు. GSLV MK-3 వాహకనౌక ద్వారా మూడు మాడ్యూల్స్ ల్యూనార్ మిషన్- ఆర్బిటర్, విక్రమ్ రోవర్‌ను అంతరిక్షంలోకి తీసుకువెళ్లనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 6న వాహక నౌక చంద్రుడిపై ల్యాండ్ అవకాశం ఉందని ట్విట్టర్‌లో తెలిపింది.

2009లో చంద్రయాన్-1 ప్రయోగం నిర్వహించింది ఇస్రో. మళ్లీ పదేళ్ల తర్వాత చంద్రుడిపై ప్రయోగానికి ఇస్త్రో సర్వ సన్నద్ధమైంది. గతంతో పోల్చితే ఈసారి ఎన్నో మార్పులు తీసుకొస్తోంది. కేవలం ఇంపాక్టర్, ఆర్బిటార్‌తోనే చంద్రయాన్-1 ప్రయోగాన్ని నిర్వహించారు. కానీ చంద్రయాన్-2లో రోవర్‌ను కూడా జతచేయనున్నారు. ఈసారి కూడా ప్రయోగం విజయవంతమై చంద్రుడిపై పరిశోధనల విషయంలో మరో అడుగు ముందుకుపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు.

చంద్రయాన్‌-2 ప్రయోగంపై ఇప్పుడు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతం అయితే… ప్రపంచ అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ మరో ముందుడగు వేయనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com