జూలైలో స్టార్ట్ కానున్న బిగ్ బాస్ సీజన్ - 3
- May 04, 2019యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించాడు. నానీ దాన్ని కంటిన్యూ చేశాడు మరి ఇప్పుడు నానీ ప్లేస్ ని ఎవరు రీ ప్లేస్ చేస్తారు..? బిగ్ బాస్ షోకి ఫిదా ఐన తెలుగు టెలివిజన్ ఆడియన్స్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ నడుస్తోంది. బిగ్ బాస్ థర్డ్ సీజన్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ బిగ్ బాస్ 3కి కొత్త హోస్ట్ ఎవరు..?
బిగ్ హౌస్ 16 నుంచి 18 మంది కంటిస్టెంట్స్ వంద రోజులు బయిటి ప్రపంచానికి దూరంగా ఒకే ఇంట్లో అంతా కలిసి ఉండాలి. 2017లో తెలుగు ఆడియన్స్ కి పరిచమైన ఈ షోకి చాలా తక్కువ టైంలోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. బిగ్ బాస్ ఫస్ట్ అండ్ సెకెండ్ సీజన్స్ ని తెలుగు టెలివిజన్ ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు. అందుకే థర్డ్ సీజన్ పై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి.
ఇక బిగ్ బాస్ థర్డ్ సీజన్ హోస్ట్ కోసం చాలా మందిని సంప్రదించారు. మరోసారి ఎన్టీఆర్ పేరుని పరిశీలించినా త్రిబుల్ ఆర్ సినిమాకి కమిటై ఉండటంతో తారక్ నో చెప్పేశాడు. నానీ పేరుని ఈ సారి పరిగణలోని తీసుకోలేదు. మధ్యలో హీరోయిన్ అనుష్క పేరు కూడా వినిపించింది. చివరగా సీనియర్ హీరోస్ నాగార్జున, వెంకటేష్ తో సంప్రదింపులు జరిపారు. ఫైనల్ గా గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి హోస్ట్ గా వ్యవహరించి షోని సక్సెస్ చేసిన నాగార్జుననే బిగ్ బాస్ థర్డ్ సీజన్ కి హోస్ట్ గా డిసైడ్ చేశారు. ప్రస్తుతం మన్మధుడు 2 షూటింగ్ కోసం పోర్చుగల్ వెళ్లిన నాగ్ ఇండియా తిరిగిరాగానే బిగ్ బాస్ టీంతో జాయిన్ కానున్నాడు. జూలైలో బిగ్ బాస్ థర్డ్ సీజన్ ప్రారంభంకానుంది.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్