డబ్బింగ్ పనుల్లో 'సాహో'
- May 04, 2019
బాహుబలి అభిమానుల ఎదురుచూపులకి తెరపడబోతుంది. సాహో సినిమా శరవేగంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. బాహుబలి ఈసారి బాంబులతో యుద్ధం చేయబోతున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా 200 కోట్లకిపైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో. ఈ మూవీ షూటింగ్ చివరిదశకి చేరుకుంది. శుక్రవారంతో సాహో షూటింగ్ ఒక్క పాట మినహా మొత్తం కంప్లీట్ అయ్యింది. ఈ రోజు (మే 4, 2019) నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలవ్వనున్నాయి. ఆగష్టు 15న సాహో ఆడియన్స్ ముందుకి రానుంది.
సాహో ఇలా కంప్లీట్ అయ్యిందో లేదో ప్రభాస్ వెంటనే రాధాకృష్ణ సినిమాకి షిఫ్ట్ అయ్యేందుకు ప్లాన్ వేసుకున్నాడు. సాహో డబ్బింగ్ పూర్తిగాకానే మే పదిన యూరప్ ఫ్లైట్ ఎక్కేందుకు రెడీ అవుతున్నాడు. రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్, పూజా హెగ్డె జంటగా రానున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా షూటింగ్ యూరప్ లో జరగనుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..