మెగా హీరో టైటిల్ 'జాలరి' కాదు.. ఉప్పెన!
- May 05, 2019మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా వైష్ణవ్‌ను వెండితెరకు పరిచయం చేస్తున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమాకు 'జాలరి' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారంటూ ప్రచారం జరిగింది. కానీ ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్ తెర మీదకు వచ్చింది. జాలర్ల నేపథ్యంలో ఎమోషనల్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'ఉప్పెన' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ టైటిల్‌ను చిత్ర నిర్మాతలు రిజిస్టర్ చేయించారట. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్