'ఈగ' విలన్‌తో కండలవీరుడు
- May 05, 2019
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్... తనతో గొడవకు దిగిన 'ఈగ' విలన్ సుదీప్ కిచ్చాకు తాట తీస్తున్నారు. ఇది రియల్ కాదు... 'రీల్ సీన్'. వివరాల్లోకి వెళితే బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. త్వరలో రిలీజ్ కాబోయే తన సినిమా 'భారత్' ఫ్రమోషన్లో పాల్గొంటూనే మరోవైపు 'దబంగ్-3' షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు. 'దబంగ్-3' ని ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. ఈ నేపధ్యంలో సల్మాన్ ప్రస్తుతం విలన్‌తో కూడిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో విలన్‌గా 'ఈగ' నటుడు సుదీప్ కిచ్చా నటిస్తున్నారు. తాజాగా సుదీప్ ఈ సినిమాకు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికింద 'ఎండలు మండిపోతున్నాయి. వీటిని తట్టుకోవడం కష్టంగా ఉంది. అయితే సెట్‌లో అందుతున్న ఎనర్జీతో ఎండల ప్రభావం పడటం లేదు. షూటింగ్‌తో రోజంతా ఉత్సాహంగా గడచిపోతోంది. చిత్ర యూనిట్ ఎంతగానో శ్రమిస్తోంది. ఇంట్లో ఉన్నభావననే ఇక్కడ కల్పిస్తున్నందుకు సల్మాన్ సర్‌కు థ్యాక్స్' అని రాశారు. కాగా 'దబంగ్-3'కి ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..