'గేమ్ ఓవర్' టీజర్ విడుదల
- May 15, 2019హైదరాబాద్: కథానాయిక తాప్సి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'గేమ్ ఓవర్'. అశ్విన్ శరవనన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైనాట్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ప్రచార చిత్రంలో తాప్సిని మాత్రమే చూపించారు. ఆమె గేమ్స్‌ను డిజైన్ చేసే అమ్మాయి పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. తాప్సిని హత్య చేయడానికి ఓ వ్యక్తి ప్రయత్నిస్తూ కనిపించారు. 'మనకు రెండు జీవితాలు ఉంటాయి.. రెండోది మొదలయ్యే సరికీ.. ఒక జీవితమే ఉందని అర్థం అవుతుంది' అంటూ కథను టీజర్లో చెప్పే ప్రయత్నం చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగు సంభాషణలను వెంకట్ కాచర్ల రాశారు. రోన్ ఎథాన్ యోహన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో జూన్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్‌లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ