ఐదేళ్ళ వీసా కోసం 6000 మంది ఇన్వెస్టర్స్‌ దరఖాస్తు

ఐదేళ్ళ వీసా కోసం 6000 మంది ఇన్వెస్టర్స్‌ దరఖాస్తు

యూ.ఏ.ఈ:ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ ఐడెంటిటీ అండ్‌ సిటిజన్‌షిప్‌ (ఐసిఎ), లాగ్‌ టెర్మ్‌ రెసిడెన్సీ అప్లికేషన్స్‌కి సంబంధించి ప్రకటన విడుదలైన తొలివారంలోనే 6,000 మంది ఇన్వెస్టర్స్‌, ఎంటర్‌ప్రెన్యూర్స్‌ నుంచి అప్లికేషన్లు వచ్చినట్లు పేర్కొంది. ఐసిఎ, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ని పొంపొందించేందుకు ఈ లాంగ్‌ టెర్మ్‌ వీసా ప్రక్రియకు క్యాబినెట్‌ ఆమోదం లభించడంతో ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఈ నెల ప్రారంభంలోనే ప్రకటించిన విషయం విదితమే. రెసిడెన్సీ వీసాలను జారీ చేసే ప్రక్రియకు ఇన్‌ఛార్జిగా ఫెడరల& అథారిటీ ఫర్‌ ఐడెంటిటీ అండ్‌ సిటిజన్‌ షిప్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తోంది. 

 

Back to Top