తండ్రికి సూపర్‌స్టార్ గిఫ్ట్
- May 27, 2019హైదరాబాద్: సూపర్‌స్టార్ కృష్ణ 31న తన 76వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు మహేశ్‌బాబు వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారట. అంతేకాదు ఆయనకు బర్త్‌డే కానుకగా తన 26వ సినిమా గురించి ప్రకటించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. త్వరలో మహేశ్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తారు. ఈ విషయాన్ని అనిల్ ఇటీవల ట్విటర్ వేదికగా కాస్త వినూత్నంగా ప్రకటించారు. 31న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలుస్తోంది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్ నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. అనిల్ సుంకర ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తారు. ‘దూకుడు’, ‘f2’ లాగే ఈ సినిమా కూడా వినోదాత్మకంగా ఉంటుందని చిత్రవర్గాలు అంటున్నాయి. ‘మహర్షి’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న మహేశ్.. ప్రస్తుతం కుటుంబంతో కలిసి విహారయాత్రలో ఎంజాయ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..