1000 మంది చిన్నారుల గుండె చప్పుళ్లు విన్న మహేష్ బాబు
- June 18, 2019సమాజానికి ఎంతో కొంత చేయాలి లేకపోతే లావైపోతాం అన్న శ్రీమంతుడి సినిమాలోని డైలాగ్‌ని అక్షరాలా ఆచరిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. రీల్ లైఫ్‌లో సామాజిక సమస్యలను ఎత్తి చూపుతూ వాటినే ప్రధానాంశంగా తీసుకుని సినిమాలు చేసే మహేష్.. రియల్ లైఫ్‌లో వాటి పరిష్కార మార్గంలో భాగస్వాములవుతున్నారు. గత మూడున్నరేళ్లలో ఆయన వెయ్యి మందికి పైగా చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్లు చేయించారు. మహేశ్‌తో కలిసి ఆంధ్రా హాస్పిటల్ వివిధ గ్రామాల్లో 18 క్యాంప్‌లు నిర్వహించి చిన్నారులకు ఆపరేషన్లు చేయించింది. ఈ విషయాన్ని మహేశ్ భార్య నమ్రత ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఆంద్రా హాస్పిటల్స్, బ్రిటన్‌కు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌తో కలిసి చిన్నారుల ఆరోగ్యంపై అవగాహన చర్యలు చేపట్టడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఓ మంచి పని కోసం తమకు సహకారం అందించిన డాక్టర్ పీవీ రామారావుకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. మహేశ్ దంపతులు చేస్తున్న మంచి పనిని ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ