'బందోబస్త్' ఫస్ట్ లుక్ రిలీజ్!
- June 28, 2019కోలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో సూర్య తెలుగు ఆడియన్స్ కి మంచి సుపరిచితుడు. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగు లో డబ్ అవుతుంది. కొన్ని సినిమాలు అయితే సూపర్ హిట్ గా నిలిచాయి..అలాంటి వాటిలో సింగం సీరీస్ ఒకటి. తెలుగు హీరోలతో మంచి సాన్నిహిత్యంతో ఉండే సూర్య తాజాగా నటించిన మూవీ టైటిల్ రిలీజ్ అయ్యింది. హీరో సూర్య, మలయాళ స్టార్ మోహన్ లాల్, ప్రముఖ హీరో ఆర్య ప్రధాన పాత్రలలో కేవీ ఆనంద్ తెరకెక్కిస్తున్న మూవీ కప్పాన్.
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'కప్పాన్' మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తెలుగులో కూడా సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. సినిమా తెలుగు టైటిల్ ని రాజమౌళి చేతుల మీదుగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. బందోబస్త్ అనే టైటిల్ తో తెలుగులో రిలీజ్ కానున్న ఈ సినిమాలో మోహన్ లాల్ - ఆర్య కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
స్టూడియో గ్రీన్ పతాకంపై అల్లిరాజా సుభాష్‌కరణ్, కేఈ జ్ఞానవేల్ రాజాలు నిర్మిస్తున్న ఈ సినిమాకి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. సాయేషా సైగల్.. సూర్య సరసన నటిస్తుంది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఆగస్ట్ 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. NGK సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాడు. మరి ఈ సినిమాతోనైనా హిట్టందుకుంటాడో లేదో చూడాలి.
తాజా వార్తలు
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!