'పహిల్వాన్' గా సుదీప్
- July 10, 2019ఎస్.కృష్ణ దర్శకత్వంలో పహిల్వాన్ అనే చిత్రం చేస్తున్నాడు కన్నడ నటుడు సుదీప్. ఈ చిత్రాన్ని స్వప్న కృష్ణ పహిల్వాన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కిచ్చ సుదీప్ పహిల్వాన్‌గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం పలు కసరత్తులు సైతం చేశాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తొలిసారిగా సుదీప్ ఈ సినిమాలో కుస్తీ వీరునిగా, బాక్సర్‌గా అభిమానులను అలరించబోతున్నాడు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో కబీర్ దుహాన్‌సింగ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. స్టంట్స్ కోసం హాలీవుడ్ నుంచి లార్వెన్ సోహైల్ అనే నిపుణున్ని కూడా పిలిపించారు. అర్జున్ జన్యా సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగులో పహిల్వాన్ అనే టైటిల్ తో విడుదల కానుంది. ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కిల్లింగ్ లుక్స్ లో రియల్ పైల్వాన్లా సుదీప్ ఉన్నాడని చిరు అన్నారు. వచ్చాడయ్యో పహిల్వాన్ అనే సాంగ్‌ని రేపు సాయంత్రం 6.30ని.లకి విడుదల చేయనున్నట్టు పోస్టర్ ద్వారా ప్రకటించింది చిత్ర బృందం. ఆ పోస్టర్లో సుదీప్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం