ఈ కారు ఖరీదు రూ.14 కోట్లంట!!
- July 17, 2019స్పోర్ట్స్ కార్లు, స్పోర్ట్స్ బైకులు వాడుకలో ఉన్న వాటికి భిన్నంగా ఉంటాయి. వాటికంటూ కొన్ని స్పెషల్ ఫీచర్లతో తయారు చేస్తాయి కంపెనీలు. అందరి దగ్గరా ఉన్న కారే తమ దగ్గర కూడా ఉంటే స్పెషలేముంది అని అనుకునే వారికి ‘ఎవియా’ కార్ని ఎంచుకోమంటోంది బ్రిటన్‌కి చెందిన ఆటో కంపెనీ లోటస్. సాధారణంగా చిన్న స్పోర్ట్స్ కార్లను తయారు చేసే లోటస్.. ఈసారి 2 మిలియన్ డాలర్ల (మన దేశ కరెన్సీలో రూ.13,78,10,000).. 1900 హార్స్ పవర్‌తో పనిచేసే ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ఫలితంగా ఇది రోడ్ కార్లలో ప్రపంచంలోనే పవర్ఫుల్ సిరీస్ మోడళ్లలో ఒకటైంది. మూడే మూడు సెకన్లలో 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఈ కారు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. స్పోర్ట్స్ కార్లను ఇష్టపడే వారికి ఎవియా బాగా నచ్చుతుందని లోటస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫిల్ పొఫామ్ అన్నారు. నిజానికి ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువ మన్నిక ఇవ్వవని, బ్యాటరీ త్వరగా వేడెక్కిపోతుందని.. అందువల్లే లంబోర్గినీ, ఫెర్రారీ లాంటి కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లు తయారు చేయడం లేదని అన్నారు. కానీ తాము మాత్రం సమస్యలన్నింటినీ నివారించుకుంటూ ఎవియా కారుని రూపొందించామన్నారు.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ