ఆల్కహాల్ విక్రయం: ఆసియన్ మేన్‌కి జైలు శిక్ష
- August 06, 2019బహ్రెయిన్:లిక్కర్ బాటిల్స్‌ని విక్రయించేందుకు వీలుగా తన కోల్డ్ స్టోర్‌ని వినియోగించుకున్న ఓ ఆసియాకి చెందిన వ్యక్తికి జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. తన కోల్డ్ స్టోర్‌లో లిక్కర్ బాటిల్స్‌ని దాచి, ఎంపిక చేసుకున్న వ్యక్తులకు మాత్రమే విక్రయిస్తూ వచ్చాడని నిందితుడి గురించిన వివరల్ని ప్రాసిక్యూటర్స్ వెల్లడించారు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించగా, నిందితుడికి చెందిన కోల్డ్ స్టోర్‌లో 52 లిక్కర్ బాటిల్స్‌ని కనుగొన్నారు. కాగా, అతని నుంచి 18 బహ్రెయినీ దినార్స్ విలువైన కరెన్సీ బిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. కాగా, న్యాయస్థానం నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష పూర్తయ్యాక, నిందితుడ్ని దేశం నుంచి డిపోర్ట్ చేస్తారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పుని పై కోర్టు కూడా సమర్థించడంతో అప్పీల్ చేసుకునే అవకాశాలు కూడా లేకుండా పోయాయి నిందితుడికి.
తాజా వార్తలు
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..