'కమల్‌హాసన్' న్యూ లుక్
- August 06, 2019శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'భారతీయుడు2'. ఈ చిత్రంలో నటుడు కమల్‌హాసన్..కాజల్ నటిస్తున్నారు. ఎప్పుడో కొబ్బరికాయ కొట్టిన ఈ చిత్రం మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా ఉంది. ఈ నేపథ్యంలో కమల్‌హాసన్ తాజా లుక్ చూస్తుంటే త్వరలోనే ఈ సినిమా మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కమల్ ప్రస్తుతం తమిళ బిగ్‌బాస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు న్నాడు. తాజాగా ఆయన క్లీన్ షేవ్‌తో కనిపించారు. దీంతో తాజా లుక్ 'భారతీయుడు2' కోసమేనని సినీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కమల్-శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 19వ తేదీ నుంచి రాజమహేంద్రవరంలో షూటింగ్ చేస్తార ట. అయితే, దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక