అసభ్యకరమైన వీడియో: బహ్రెయినీ నటి అరెస్ట్
- August 07, 2019బహ్రెయిన్:సోషల్ మీడియాలో అసభ్యకరమైన ఫొటోల్ని పోస్ట్ చేస్తున్న బహ్రెయినీ నటిని అరెస్ట్ చేశారు. 31 ఏళ్ళ నిందితురాలిపై కేసు నమోదు చేయడం జరిగిందనీ, ఆగస్ట్ 14న క్రిమినల్ కోర్టులో ఈ కేసు విచారణకు వస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. క్యాపిటల్ గవర్నరేట్ ప్రాసిక్యూషన్ డిప్యూటీ అటార్నీ జనరల్ అహ్మద్ అల్ అన్సారీ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో ఇమ్మోరల్ యాక్ట్స్‌కి పాల్పడుతున్నందున ఆమెపై కేసులు నమోదయినట్లు చెప్పారు. పబ్లిసిటీ కోసమే ఆ పని చేసినట్లు నిందితురాలు పేర్కొందని వివరించారు అల్ అన్సారీ. కాగా, సోషల్ మీడియాలో ఇలాంటి అసభ్యకరమైన వీడియోలు, ఫొటోల్ని ఎవరూ ప్రచారం చేయకూడదనీ, తమ దృష్టికి అసభ్యకరమైన విషయాలు వస్తే, వెంటనే ఫిర్యాదు చేయాలని అల్ అన్సారీ పేర్కొన్నారు. అరెస్ట్ జరిగిన కాస్సేపటికే ఆమె సోషల్ మీడియా అకౌంట్ నుంచి తొలగించబడింది.
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు