నేడు అందాల నటి శ్రీదేవి పుట్టిన రోజు

- August 13, 2019 , by Maagulf
నేడు అందాల నటి శ్రీదేవి పుట్టిన రోజు

నటన అందం శృంగారం హావభావాల తో కమర్షియల్ గా ఎన్నో విజవంతమైన సినిమాలలో ఆమె నటనకు నీరాజనాలే లభించాయి. అనేక సినిమాలు ఆమె వలననే సూపర్ హిట్ అయ్యాయి. ఎన్.టి.ఆర్ - శ్రీదేవి "ఒక ఆన్ స్క్రీన్ బ్రాండ్ పెయిర్" అలాగే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున తో జట్టు గట్టిన సినిమాలు తెలుగు చిత్ర సీమను ఉర్రూతలూగించాయి.

తన నాలుగేళ్ళ వయసు నుండే బాలనటి గా అనేక అవార్డ్స్ గెలుచుకుంది. తెలుగులో ఎన్.టి.ఆర్ మనవరాలుగా బడిపంతులు సినిమాలో నటించి పేరు ప్రతిష్ఠలు ఘడించింది. అదే శ్రీదెవి 1979 లో ఎన్.టి.ఆర్ వెటగాడు సినిమాలో జోడీ కట్టి ఆ సినిమా బ్లాక్-బస్టర్ గా నిలిచింది. 1976 లో రజనికాంత్ తో ఒక తమిళ సినిమాలో కథానాయకి గా తొలిసారి నటించి ఘనవిజయం స్వంతం చేసుకుంది.

తన అందచందాలతో, హావభావాలతో అన్ని తరాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న శ్రీదేవి 
'జగదేక వీరుడు అతిలోక సుందరి" సినిమాలో దేవలోకంలోంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా కనిపించే శ్రీదేవి అంటే ఇష్టపడని వారంటు ఉండరు. శ్రీదేవి అంటే అందం, అభినయం, హుందాతనం, దర్పం, ప్రేమ, త్యాగం, లాలిత్యం.

ఫిబ్రవరి 24, 2018 న దుబాయ్ లో తాను బసచేసిన హోటల్ గది బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ మునిగి శ్రీదేవి మరణించింది. ఈమె మరణవార్త విని ఆసేతుహిమాచలం దిగ్భ్రాంతికి గురి అయింది. ఈమెను కడసారి చూడటం కోసం దక్షిణాది నుండి ఎందరో సినీప్రముఖులు, అభిమానులు, బంధువులు ముంబై తరలి వచ్చారు. అశేషమైన అభిమాన జనసందోహం వెంట నడువగా ఫిబ్రవరి 28న ముంబైలో ఈమె అంతిమయాత్ర చిరస్మరణీయంగా జరిగింది. చిత్రసీమలో మూడు దశాబ్దాలపాటు అగ్రనాయికగా వెలుగొంది అప్సరసను తలపించే అందం, అంతకుమించిన అభినయంతో భారతీయుల హృదయాలలో చెరగని ముద్రవేసిన శ్రీదేవి అంత్యక్రియలు మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జరగడంతో ఆమె ఘనతకు తగిన వీడ్కోలు లభించినట్లయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com