పెద్దమనసు చాటుకున్న ఆఫ్ డ్యూటీ దుబాయ్ కాప్
- August 13, 2019దుబాయ్:పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తోన్న వ్యక్తులు ఆఫ్ డ్యూటీలో వున్నప్పుడూ నైతిక బాధ్యతగా విధులు నిర్వహిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. షార్జాలో దుబాయ్ పోలీస్ అధికారి ఒకరు, ఆఫ్ డ్యూటీలో వుండి కూడా ఓ వాహనదారుడికి సాయం చేశారు. టైర్ బరస్ట్ కావడంతో దిక్కు తోచని స్థితిలో రోడ్డుపై వాహనంతో నిలిచిపోయిన ఓ భారతీయ వలసదారుడికి సాయం చేశారు ఆ అధికారి. కేరళకు చెందిన దుబాయ్ రెసిడెంట్ అబ్దుల్ వహాబ్ ఆ సంఘటనను వివరిస్తూ, ఓ పోలీస్ అధికారి తనకు చేసిన సాయాన్ని ఎప్పుడూ మర్చిపోలేనని అన్నారు. నైట్ డ్యూటీ ముగించుకుని వస్తున్న ఓ అధికారి, తన కష్టాన్ని చూసి సాయం చేశారనీ, ఇతరులెవరూ అంత వేడి వాతావరణంలో తనకు సాయం చేసేందుకు ముందుకు రాలేదని అన్నారాయన. అయితే, సదరు అధికారి వివరాల్ని వాహబ్ వెల్లడించలేదు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు