బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆత్మహత్య యత్నం
- August 19, 2019తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 చాలా స్మూత్‌గా ఎంటర్టైన్మెంట్తో సాగుతోంది. ఇదే సమయంలో తమిళ బిగ్‌బాస్ గురించి మాత్రం మొదటి నుండి ఏదో ఒక విమర్శ వస్తూనే ఉంది. ఇప్పటికే ఒక కంటెస్టెంట్‌ను అర్థాంతరంగా బయటకు పంపించిన బిగ్‌బాస్ నిర్వాహకులు తాజాగా నటి మధుమిత చేసిన పనికి ఆమెను అర్థాంతరంగా బయటకు పంపించినట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మధుమిత ఇప్పటికే 50 రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉంది.
తమిళ బిగ్‌బాస్ హౌస్‌లో కొందరు ఈమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేయడంతో పాటు, ఒక ఆట ఆడుకోవడం జరిగిందట. దాంతో ఆమె ఒత్తిడికి ఏకంగా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్లుగా సమాచారం అందుతోంది. వెంటనే ఆమెను కాపాడిన ఇంటి సభ్యులు మరియు నిర్వాహకులు ఆమెను బయటకు పంపించినట్లుగా సమాచారం అందుతోంది. బయటకు వచ్చిన తర్వాత ఆమె మాట్లాడుతూ హౌస్ మేట్స్ నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు