శ్రీశ్రీ కి సిరాశ్రీ పద్యం
- April 30, 2016సరిగ్గా 106 ఏళ్ళ క్రితం శ్రీశ్రీ పేరుతో యుగాలను శాసించగల కవితాశక్తి ఈ నేలపై అడుగు పెట్టిన రోజిది. పద్యాలు వ్రాయగలిగి, వ్రాసి, వాటిని విడనాడి, లయాత్మక వచన కవిత్వానికి ప్రాణం పోసిన ఆ కవికి ఒక మత్తకోకిల పద్యం. ఇది శ్రీశ్రీ గురించి కనుక "ఉన్మత్తకోకిల" అనొచ్చేమో!
"నేనుసైతము" మంత్రమూర్ఛన నిప్పురవ్వగ మండగా;
సానబెట్టిన కత్తియంచుల సాహితిన్ సృజియించగా;
దీనదేశపు వెఱ్ఱి చీకటి దిక్కులన్నియు వీడ, "శ్రీ
శ్రీ" నిజమ్మగు తేజమై, కవిసింగమై, విలసిల్లుగా!!
-సిరాశ్రీ
తాజా వార్తలు
- గ్రీన్ టెక్నాలజీపై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం