అల్ దఖిలియాలోని పురాతన ప్రదేశాల పునరుద్ధరణ..!!
- March 17, 2025
నిజ్వా: చారిత్రక ప్రదేశాలతో సమృద్ధిగా భౌగోళిక వారసత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాలలో భాగంగా ఒమన్ చర్యలు చేపట్టింది. అల్ దఖిలియా గవర్నరేట్ పురావస్తు ప్రదేశాల అభివృద్ధి, పునరుద్ధరణపై దృష్టి సారించే వరుస ప్రాజెక్టులను ప్రారంభించింది. పెట్టుబడిదారులు, సందర్శకులకు గవర్నరేట్‌ను ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చడం ఈ ప్రాజెక్టుల లక్ష్యమని అల్ దఖిలియా గవర్నర్ షేక్ హిలాల్ సయీద్ అల్ హజ్రీ తెలిపారు. స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి, భవిష్యత్తులో గవర్నరేట్‌ను ఒక ముఖ్యమైన సాంస్కృతిక వాణిజ్య కేంద్రంగా మార్చడానికి పునాదిని నిర్మించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంతోపాటు స్థానిక యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు.
గవర్నరేట్ లోని పురావస్తు ప్రదేశాల పునరుద్ధరణ, అభివృద్ధి ద్వారా వారసత్వ ప్రదేశాలను పునరుద్ధరించడానికి గవర్నరేట్ OMR3.78 మిలియన్లకు పైగా ఖర్చుతో ప్రాజెక్టులను ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. గవర్నరేట్ కు వచ్చే వారి సంఖ్య పెరిగిందన్నారు. 2023లో 312,200 నుండి 2024లో 415,000 కు పెరిగిందని, 33 శాతం వృద్ధి రేటును సాధించిందని ఆయన వివరించారు.
ప్రస్తుతం అమలు చేయబడుతున్న ప్రాజెక్టులలో బహ్లా సౌక్ అభివృద్ధి, జబ్రీన్ ఎంట్రన్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఒమన్ సుల్తానేట్‌లోని అత్యంత ప్రముఖ చారిత్రక ప్రదేశాలలో ఒకటైన జబ్రీన్ కోట స్థానాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. "ఓల్డ్ అల్ హమ్రా నైబర్‌హుడ్ రెన్యూవల్" ప్రాజెక్ట్ ద్వారా గవర్నరేట్ చరిత్రను ఆధునికంగా తీర్చిదిద్దుతామన్నారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







