నాసా కీలక ప్రకటన.. సునీతా విలియమ్స్ భూమిపైకి వచ్చే సమయం ఇదే..
- March 17, 2025
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తొమ్మిది నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిపైకి రానున్నారు. వారిని తీసుకొచ్చేందుకు నాసా- స్పేస్ ఎక్స్ ప్రయోగించిన క్రూ-10 మిషన్ ఆదివారం విజయవంతంగా భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది.
బుధవారం తెల్లవారు జామున..
క్రూ-10 మిషన్ లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. వారికి సునీతా, బుచ్ విల్మోర్ లు ఘనస్వాగతం పలికారు. అయితే, సునీతా విలియమ్స్, విల్మోర్ లు భూమిపైకి రానున్నారు. ఈ విషయంపై నాసా తాజాగా కీలక ప్రకటన చేసింది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు (భారత కాలమానం ప్రకారం మార్చి 19వ తేదీ తెల్లవారుజామున 3.27గంటలకు) ప్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా వెల్లడించింది.
ప్రక్రియ ఇలా..
క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10.45 గంటలకు మొదలవుతుంది. సోమవారం అర్థరాత్రి 12.45 గంటలకు అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక్ అన్ డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయిన తరువాత మంగళవారం సాయంత్రం 4.45గంటలకు వ్యోమనౌక భూమికి తిరుగు పయనమవుతుంది. సాయంత్రం 5.11 గంటలకు భూ కక్ష్యలను దాటుకొని కిందికు వస్తుంది. సాయంత్రం మంగళవారం 5.57 గంటలకు ప్లోరిడా తీరానికి చేరువలోని సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







