మూత్రపిండ వ్యాధి పై అవగాహన కొరకు బైకర్స్ ర్యాలీని నిర్వహించిన మెడికవర్ హాస్పిటల్స్

- March 17, 2025 , by Maagulf
మూత్రపిండ వ్యాధి పై అవగాహన కొరకు బైకర్స్ ర్యాలీని నిర్వహించిన మెడికవర్ హాస్పిటల్స్

హైదరాబాద్: వరల్డ్ కిడ్నీ డే పురస్కరించుకొని మెడికవర్ హాస్పిటల్స్ & హార్లే డేవిడ్‌సన్ బైకర్స్ కలిసి కిడ్నీ వ్యాధులపై అవగాహన పెంచడం కోసం బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సత్యనారాయణ-ACP ట్రాఫిక్ విచ్చేసి జెండా ఊపి రైడ్ని ప్రారంభించడం జరిగింది.ముఖ్య అతిధిగా సత్యనారాయణ -ACP ట్రాఫిక్ మాట్లాడుతూ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, హార్లే ఓనర్స్ గ్రూప్, బంజారా చాప్టర్ సభ్యుల భాగస్వామ్యంతో కలిసి కిడ్నీ వ్యాధులపై అవగాహన పెంచేందుకు, ప్రజల్లో కిడ్నీ ఆరోగ్యంపై చైతన్యం కలిగించడానికి నిర్వహించడం చాలా అభినందించాల్సిన విషయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు కన్నా ఆరోగ్యం ఎంతో విలువైనది అని అన్నారు 

ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ నెఫ్రాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ కమల్ కిరణ్ మాట్లాడుతూ చాలా మందికి  కాళ్లలో వాపు, నిరంతర అలసట చిన్న సమస్యలుగా కనిపిస్తాయి కానీ వాటి తీవ్రత దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) ఉన్నట్లు బయటపడుతున్నాయి. అనేక మంది ప్రజలకు ముందస్తు లక్షణాలు లేకపోవడం, మధుమేహం లేకపాయినా మూత్రపిండాలు పని చేయడం ఆగిపోవడం సాధారణంగా కనిపిస్తోంది.భారతదేశంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి వేగంగా విస్తరిస్తున్న ఆరోగ్య సమస్య. గత దశాబ్దంలో వేలాది మరణాలకు కారణమైన ఈ యొక్క వ్యాధి. CKD అధికంగా ఉండడానికి ప్రధాన కారణాలు మధుమేహం, అధిక రక్తపోటు. CKD రోగుల్లో 87% మందికి హైబీపీ ఉంది, 37.5% మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. అదనంగా, ఇతర సమస్యలకి మందులు అధిక వినియోగం, డీహైడ్రేషన్ మూత్రపిండ ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలోకి నెడుతున్నాయి. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు కూడా CKD పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఎండలో ఎక్కువ సమయం పనిచేసే కార్మికులు నిర్జలీకరణకు గురవడంతో కిడ్నీల పై ఒత్తిడి పెరిగి, ముదిరిన స్థాయిలో మూత్రపిండ వైఫల్యం కలుగుతోంది. ప్రపంచ మూత్రపిండ దినోత్సవం 2025 థీమ్ “మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉన్నాయా? ముందస్తు పరీక్షలు చేయించుకోండి, ఆరోగ్యంగా ఉండండి” అనే సందేశంతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం అని అన్నారు.

మెడికవర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ "మన శరీరంలో రక్తంలో నిరంతరం ఎన్నో  వ్యర్థాలు, విషతుల్యాలను కిడ్నీలు ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ అవి ఎప్పటికప్పుడు బయటకు పోతేనే శరీరం ఆరోగ్యంగా మరియు మనం బ్రతకగలం.దీర్ఘకాల కిడ్నీజబ్బు చివరిదశలోకి చేరుకున్నాక మందులతో ఇక ఎలాంటి ప్రయోజనం లేదని భావించినప్పుడు డయాలిసిస్‌ లేదా కిడ్నీ మార్పిడే శరణ్యం.డయాలిసిస్‌తో చేసిన కూడా 50-60 శాతమే రక్తం శుద్ధి అవుతుంది.దీని కోసం వారానికి మూడు సార్లు ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. ఇందుకు ఖర్చూ ఎక్కువే అవుతుంది. ఇన్‌ఫెక్షన్ల ముప్పూ పొంచి ఉంటుంది. దీంతో రోజువారీ జీవితం అస్తవ్యస్త మవుతుంది. అందుకే దాతలు అందుబాటులో ఉంటే ముందు కిడ్నీ మార్పిడి ఉత్తమమైంది.ఇది సహజ కిడ్నీ మాదిరిగానే పనిచేస్తుంది. రోజువారీ జీవనం మెరుగవుతుంది. జీవనకాలమూ పెరుగుతుంది. అయితే ప్రస్తుతం కిడ్నీ మార్పిడి అవసరమైనవారిలో 5% మందికే కిడ్నీలు అందుబాటులో ఉంటున్నాయి. మిగతా 95% మంది ఎదురు చూపులు చూస్తున్నవారే. దీనికి ప్రధాన కారణం దాతలు దొరక్కపోవటం.దాతలు దొరికినా రక్తం గ్రూపు సరిపడకపోవటం మరో సమస్య. కిడ్నీ దాతల్లో సుమారు 40-50% మంది ఇలా వేరే రకం గ్రూప్‌ రక్తం గలవారే ఉంటున్నారు.అప్పుడు మనం ‘ఏబీఓ ఇన్‌కంపాటబుల్‌ (ABOI) కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌’ ప్రక్రియ ద్వారా మార్పిడి చేస్తున్నాం.రక్తం గ్రూపు సరిపడకపోయినా సురక్షితంగా కిడ్నీ మార్పిడికి వీలు కల్పించటం దీని ప్రత్యేకత అని అన్నారు.

మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ అఫ్ బిజినెస్ ఆపరేషన్స్ మహేష్ దెగ్లూర్కర్ మాట్లాడుతూ వరల్డ్ కిడ్నీ డే అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజారోగ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తాము" అని అన్నారు.ఈ ర్యాలీ ద్వారా ప్రజలను చైతన్యపరిచేందుకు మా ప్రయత్నం" అని అన్నారు. 
ఈ యొక్క రైడ్ కిడ్నీ ఆరోగ్యం పై ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి నియోపోలీస్ మూవీ టవర్స్  మీదుగా క్రిమ కేఫ్ మోకిల, అక్కడ నుంచి తిరిగి మెడికవర్ హాస్పిటల్స్ రావడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com