అర్జున్ సన్నాఫ్ వైజయంతి' నుండి పవర్ ఫుల్ టీజర్
- March 17, 2025
విజయశాంతి కొన్నాళ్ల క్రితం సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాతో మళ్ళీ రానుంది. అప్పట్లో విజయశాంతి అంటే కమర్షియల్ సినిమాలతో పాటు పవర్ ఫుల్ పోలీస్ పాత్రలకు పెట్టింది పేరు. ఇప్పుడు అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో కూడా మళ్ళీ విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతుంది.
తాజాగా నేడు అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ రిలీజ్ చేసారు. టీజర్లో విజయశాంతి పోలీస్ పాత్రలో అదరగొట్టారు. టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా నిర్వహించగా కళ్యాణ్ రామ్ రామ్, విజయశాంతితో పాటు మూవీ యూనిట్ హాజరయ్యారు. ఈ ఈవెంట్లో కళ్యాణ్ రామ్ ఆసక్తికర విషయం తెలిపారు.
కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. సినిమా రిలీజయి బ్లాక్ బస్టర్ అయ్యాక చేపల పులుసు చేసి ఇస్తాను అని చెప్పాను. ఈ సినిమా మొదలయినప్పుడు అమ్మ(విజయశాంతి) ఒక మొక్కు మొక్కుకుంది. రిలీజయ్యాక తిరుమల వెళ్లి కాలినడకన వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటాము. అప్పటి వరకు నాన్ వెజ్ తినను అని మొక్కుకున్నారు. అది అయ్యాక అమ్మకి నేనే చేపల పులుసు చేసి పెడతాను అని తెలిపారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







