ఐపీఎల్ 18వ సీజన్ ఓపెనింగ్ సెర్మనీ..
- March 17, 2025
కోల్‌కతా: మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభం కానుంది. మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. డిపెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ సీజన్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు అన్ని జట్లు సైతం ఇప్పటికే ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాయి. ఈ సీజన్లో టైటిల్ విజేతగా నిలవాలని ఆరాటపడుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీని గ్రాండ్ గా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ వేడుకలో బాలీవుడ్ నటీనటుల డాన్సులు, పాటలతో స్టేడియాన్ని ఊర్రూతలూగించనున్నట్లు సమాచారం.
శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్ డ్యాన్స్ చేయనున్నారట. ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీలో హీట్ పుట్టించే ఈ జంట.. ఐపీఎల్ నైట్‌లో ఉర్రూతలూగిస్తారని భావిస్తున్నారు. వీరికి తోడు పాపులర్ సింగర్ అరిజిత్ సింగ్, శ్రేయ ఘోషాల్ తన పాటలతో యూత్‌ను మైమరపింపజేస్తారని చెబుతున్నారు. వీరే కాకుండా పలువురు బాలీవుడ్ నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!