ఇఫ్తార్ సమయంలో ప్రమాదం..ముగ్గురు టీనేజర్లు మృతి..!!

- March 21, 2025 , by Maagulf
ఇఫ్తార్ సమయంలో ప్రమాదం..ముగ్గురు టీనేజర్లు మృతి..!!

యూఏఈ: యూఏఈలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు ఎమిరాటీ యువకుల మరణించారు. ఈ ఘటన మరోసారి మైనర్ డ్రైవింగ్ ప్రమాదాలపై చర్చను ప్రారంభించింది. ఇఫ్తార్ సమయంలో షార్జాలోని కల్బా రోడ్డులో జరిగిన ఈ ప్రమాదం, వాహనంపై నియంత్రణ కోల్పోయిన మైనర్ డ్రైవర్ వల్ల జరిగిందని, ఫలితంగా ప్రాణాంతక ప్రమాదం జరిగిందని పోలీసులు నివేదించారు.   లైసెన్స్ లేకుండా మైనర్లు డ్రైవింగ్ చేయడంతో ముడిపడి ఉన్న ఈ ఘటన అందరిని ఆలోచింపజేస్తుంది.  

మైనర్ డ్రైవింగ్ పై అధికారులు గతంలోనూ హెచ్చరించారు. యువ టీనేజర్లు తమ తల్లిదండ్రుల వాహనాలను అనుమతి లేకుండా, తరచుగా తోటివారి ఒత్తిడి ప్రభావంతో నడుపుతున్నారని తెలుస్తుంది. కొంతమందికి ఇది గర్వకారణం, స్నేహితులను ఆకట్టుకోవడానికి ఒక మార్గంగా చేసుకుంటారని తెలిపారు.  

మార్చి 29 నుండి అమలులోకి రానున్న ట్రాఫిక్ రెగ్యులేషన్‌పై 2024 నాటి ఫెడరల్ డిక్రీ-లా నంబర్ (14) ప్రకారం, కార్లు..తేలికపాటి వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కనీస వయస్సును 18 నుండి 17 సంవత్సరాలకు తగ్గించడంతో సహా  మార్పులను ప్రవేశపెడుతుంది. ప్రమాదకరమైన డ్రైవింగ్ చేసే వారిని అరెస్టులు చేసేందుకు అకొత్త చట్టం అనుమతిస్తుందన్నారు.  తక్కువ వయస్సు గలవారు వాహనం నడపడం వల్ల కలిగే చట్టపరమైన ప్రమాదాలు, ప్రాణాంతక పరిణామాల గురించి విద్యార్థులను బాగా అర్థం చేసుకోవడానికి సన్నద్ధం చేయాలని నిపుణులు పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com