మహిళా దినోత్సవం సందర్భంగా ‘షీ కేర్’ ప్రచారం ప్రారంభం..!!

- March 22, 2025 , by Maagulf
మహిళా దినోత్సవం సందర్భంగా ‘షీ కేర్’ ప్రచారం ప్రారంభం..!!

దోహా: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, రేయాడా మెడికల్ సెంటర్ ‘షీ కేర్’ అనే ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది మహిళలకు సరసమైన, సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి రూపొందించారు.

ఈ ప్రత్యేక ప్యాకేజీలో ముఖ్యమైన హార్మోన్ పరీక్షలు, మహిళల శ్రేయస్సును ప్రభావితం చేసే ఆరోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించడం,  నిర్వహించడం వంటివి ఉన్నాయి. ఇందులో ప్రసూతి, గైనకాలజీ నిపుణులతో నిపుణులతో కన్సల్టేషన్ కూడా ఉన్నాయి. మహిళలు వారి మొత్తం ఆరోగ్యం వైపు చురుకైన చర్యలు తీసుకోవడంలో సహాయపడుతుంది.

ఈ ప్రచారంలో భాగంగా రేయాడా మెడికల్ సెంటర్ 'నర్చర్ నోట్స్' హ్యాండ్‌బుక్‌ను కూడా ఆవిష్కరించింది. ఇది గర్భధారణకు ముందు.. తర్వాత మహిళలకు మార్గనిర్దేశం చేసే విలువైన సమాచారాన్ని పొందుపరిచారు. 'షీ కేర్' ప్యాకేజీ, 'నర్చర్ నోట్స్' హ్యాండ్‌బుక్ రెండింటినీ వారి ప్రసూతి, గైనకాలజీ నిపుణులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ శ్రీలక్ష్మి ప్రారంభించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com