బహ్రెయిన్‌లో యూరోపియన్ ఇన్వెస్టర్ కు జైలుశిక్ష..!!
- March 22, 2025
మనామా: బహ్రెయిన్‌లో మనీ లాండరింగ్ స్కీమ్ మోసాలు బయటికొచ్చాయి. ఇందులో ఒక యూరోపియన్ పెట్టుబడిదారుడితోపాటు అనేక మంది ఉన్నారని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. బాధితులను మోసపూరిత ఆపరేషన్‌లో పెట్టుబడి పెట్టేలా ప్రచారం నిర్వహించి మోసగించారని పేర్కొన్నారు. నిందితుడు దాదాపు 181 మంది బాధితులను మోసం చేశాడని తెలిపారు. ముఠా సభ్యులు 3 మిలియన్లకు పైగా బహ్రెయిన్ దినార్లను సేకరించినట్టు గుర్తించారు. కేసును విచారించిన బహ్రెయిన్ ఫస్ట్ క్రిమినల్ కోర్టు కేసులో ఉన్న రెండవ నిందితుడికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. అంతకుముందు, కోర్టు పరారీలో ఉన్న యూరోపియన్ పెట్టుబడిదారుడికి ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష, 100,000 దినార్ల జరిమానా విధించింది. నేరం ద్వారా వచ్చిన సొమ్మును జప్తు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. 3,371,250 దినార్లు, 600 ఫిల్స్‌ను నిజమైన యజమానులకు తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తీర్పును సవాలు చేసిన రెండవ ప్రతివాదికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించగా, మూడవ ప్రతివాది - ఇంకా పరారీలో ఉన్నాడని, కోర్టు అతడికి ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు 100,000 దినార్లు జరిమానా విధించదని తెలిపారు. నాల్గవ నిందితుడికి ఒక సంవత్సరం జైలు శిక్షతోపాటు 5,000 దినార్లు జరిమానా విధించారు. నకిలీ ఇన్వాయిస్లు, కొనుగోలు ఆర్డర్లను ఉపయోగించి 3 మిలియన్లకు పైగా దినార్లను సేకరించి బ్యాంకుల నుండి తన కార్యకలాపాలను నిందితులు నిర్వహించారని తెలిపారు. యూరోపియన్ మనీలాండరింగ్ సంబంధించి పలు దేశాలలో నేర చరిత్ర ఉందని విచారణలో గుర్తించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అతడు 2022లో బహ్రెయిన్‌కు వచ్చాడనీ, ప్రముఖ అథ్లెట్ల నుండి సంతకం చేసిన స్పోర్ట్స్ జెర్సీలు, జ్ఞాపికలు, విలువైన వస్తువులను విక్రయించడానికి ఒక డిజిటల్ కంపెనీని ఏర్పాటు చేశాడనీ దర్యాప్తులో వెల్లడైంది. అతను 44 కార్యాలయాలను అద్దెకు తీసుకున్నాడని, ట్టుబడిదారులను ఆకర్షించడానికి పెద్ద సేల్స్ టీమ్ ను నియమించుకొని, 22శాతం లాభాల పేరిట మోసాలకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!