చైనా విద్యుత్ ఉత్పత్తులపై యాంటీ-డంపింగ్ సుంకం విధించిన ఒమన్..!!
- March 24, 2025
మస్కట్: గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాలు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వస్తువులపై అదనపు సుంకాన్ని విధించాయి.జూన్ 8 నుండి ఐదు సంవత్సరాల కాలానికి అమలులోకి వచ్చే విధంగా 1,000 వోల్ట్లకు మించని విద్యుత్ వోల్టేజ్ కలిగిన విద్యుత్ పరికరాలు, స్విచ్ల దిగుమతులపై యాంటీ-డంపింగ్ సుంకాలను విధించాయని ఒమన్ వాణిజ్యం, పరిశ్రమ, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గల్ఫ్ సహకార మండలి దేశాలలో హానికరమైన పద్ధతులను ఎదుర్కోవడానికి సాంకేతిక సచివాలయ కార్యాలయానికి గల్ఫ్ పరిశ్రమ సమర్పించిన ఫిర్యాదు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వశాఖలోని నిషేధిత పద్ధతుల విభాగం డైరెక్టర్ ఖలీద్ బిన్ ఖామిస్ అల్ మస్రూరి ధృవీకరించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో హానికరమైన పద్ధతుల నుండి గల్ఫ్ ఉత్పత్తులను రక్షించడం, జాతీయ పరిశ్రమలకు న్యాయమైన పోటీ వాతావరణాన్ని నిర్ధారించడం ఈ నిర్ణయం లక్ష్యం అని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







