సౌదీలో రోడ్డు ప్రమాదం.. తెలుగువారి మృతి

- July 12, 2015 , by Maagulf
సౌదీలో రోడ్డు ప్రమాదం.. తెలుగువారి మృతి

బతుకుతెరువు కోసం గల్ఫ్‌దారి పట్టిన అభాగ్యులు చివరకు ఆ దారులకే బలయ్యారు. సౌదీ అరేబియాలోని రియాద్‌ నగరంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న ఐదుగురు తెలుగువారు మృత్యువాతపడ్డారు. ఆ సమయంలో వారంతా రోడ్లు శుభ్రంచేసి.. ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వారు ఎక్కిన వ్యాన్‌ కొంత దూరం వెళ్లిన తరువాత బోల్తా పడింది. ఈ విషాదంలో మొత్తం 10 మంది చనిపోగా, అందులో సగం మంది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలవారే. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం వీరు రియాద్‌ సమీపంలోని అల్‌ మజమా ప్రాంతంలో ఓ పారిశుధ్య కంపెనీలో పనిచేస్తున్నారు.

 

                          --యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com