కుక్క - గాడిద కథ

- July 11, 2015 , by Maagulf
కుక్క - గాడిద కథ

ఒక ఊరిలో ఒక పిసినారి చాకలివాడుండేవాడు. కాపలా కోసం ఒక కుక్కని, బట్టలు మోయడానికి ఒక గాడిదని పెంచేవాడు. కానీ ఎప్పుడు వాటికి కడుపునిండా తిండి పెట్టేవాడు కాదు. పగలూ, రాత్రి గొడ్డు చాకిరి చేయించుకునేవాడు. ఒకరోజు బట్టలు ఎక్కువగా ఉండి ఉతికి ఉతికి అలసిపోయి ఇంటికి వచ్చి బాగా నిద్రలోకి జారుకున్నాడు. ఆ రోజు అర్ధరాత్రి ఒక దొంగోడు చాకలివానింటిలోకి చొరబడి సొమ్మంతా కాజేయ్యాలనుకున్నాడు. దొంగ ఇంట్లోకి ప్రవేశించడాన్ని కుక్క చూసింది. కానీ మొరగలేదు. గాడిద కుక్కను గమనించి ఎందుకు నువ్వు అరవడంలేదు. వెంటనే అరిచి మన యజమానిని నిద్ర లేపు అన్నది గాడిద కుక్కతో. అందుకు కుక్క నేనెందుకు మొరగాలి. ఏనాడైనా మన యజమాని మనకు కడుపు నిండా తిండి పెట్టాడా? కడుపుకి తిండిలేక నాకు అరిచే శక్తి లేదు. అయినా మన పిసినారి యజమానికి ఇలాగే జరగాలి. జరగనీ. మంచిదే అంది. అందుకు గాడిదకి కోపం వచ్చి నువ్వు యజమానిపై చూపించే విశ్వాసం ఇదేనా? ద్రోహి. నేను నీలా కాదు. ఇన్నాళ్లు యజమాని మనని సాకుతున్నాడు అందుకు కృతజ్ఞతగా ఆయనకి సాయం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. విశ్వాసఘాతకురాలా? నేను శబ్ధం చేసి యజమానిని నిద్ర లేపుతాను అని గాడిద దాని గార గొంతుతో అరవడం మొదలుపెట్టింది. దాని అరుపుకి భయపడి దొంగ పారిపోయాడు. ఇంతలో యజమాని లేచి వచ్చి తనకి నిద్రాభంగం అయినందుకు ఏం జరిగిందని ఆలోచించకుండా ఆ గాడిదను చావబాదాడు. దాంతో పాపం గాడిద చచ్చిపోయింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com